ఓటర్ల జాబితాలో(Voters List) మీ పేరు ఉండి, మీకు ఓటు ఉండి ఓటర్‌ కార్డు లేదనుకోండి...కాంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. ఓటరు కార్డు లేకపోయినా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల కమిషన్‌(Election Commission) సూచించిన వ్యక్తిగత గుర్తింపుకార్డు(Identity Card) ఏది ఉన్నా పోలింగ్‌ బూత్‌కు(Polling Booth) వెళ్లి ఓటు వేయవచ్చు. ఓటరు కార్డు లేకపోతే గతంలో ఫోటో ఓటర్‌ స్లిప్‌, ఫోటో గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు(Aadhaar Card), పాస్‌పోర్టు(Passport), పాన్‌ కార్డు(Pancard), డ్రైవింగ్‌ లైసెన్స్‌(Driving License) చూపించి ఓటు వేసే వెసులుబాటు ఉండింది.

ఓటర్ల జాబితాలో(Voters List) మీ పేరు ఉండి, మీకు ఓటు ఉండి ఓటర్‌ కార్డు లేదనుకోండి...కాంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. ఓటరు కార్డు లేకపోయినా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల కమిషన్‌(Election Commission) సూచించిన వ్యక్తిగత గుర్తింపుకార్డు(Identity Card) ఏది ఉన్నా పోలింగ్‌ బూత్‌కు(Polling Booth) వెళ్లి ఓటు వేయవచ్చు. ఓటరు కార్డు లేకపోతే గతంలో ఫోటో ఓటర్‌ స్లిప్‌, ఫోటో గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు(Aadhaar Card), పాస్‌పోర్టు(Passport), పాన్‌ కార్డు(Pancard), డ్రైవింగ్‌ లైసెన్స్‌(Driving License) చూపించి ఓటు వేసే వెసులుబాటు ఉండింది. ఇప్పుడు బ్యాంకులు, పోస్టాఫీసులు జారీ చేసే ఫోటోతో కూడిన పాస్‌ బుక్‌(Passbook) చూపించి కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటు వేయడానికి వెళుతున్నప్పుడు వీటిలో ఏది ఉన్నా సరిపోతుంది. ఫోటో ఓటరు స్లిప్పు, ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్‌), ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగసంస్థల ఉద్యోగుల ఫోటో గుర్తింపు కార్డు, బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫోటో ఉండాలి), పాన్‌ కార్డు, జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌ కార్డు, ఎంఎన్‌ఆర్‌జీఏ జారీ చేసిన జాబ్‌ కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు, ఫోటోతో జత చేసిన పింఛను పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపుపత్రం .. వీటిలో ఏది చూపించి అయినా ఓటు వేయవచ్చు.

పోల్‌ చీటీలు(Poll slips) అందరకపోతే వర్రీ అవ్వకండి. పోలింగ్‌ కేంద్రం దగ్గర ఉండే బీఎల్‌ఓల(BLO) దగ్గరకు వెళ్లి అడగండి.. వారు ఓటరు జాబితాలో సరి చూసి ఓ చీటిపై క్రమసంఖ్య, పేరు రాసి ఇస్తారు. గతంలో ఎక్కడ ఓటేశారో అక్కడికి వెళ్లి బీఎల్‌ఓలను సంప్రదించాలి. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు మాత్రం అప్లికేషన్‌ టైమ్‌లో ఏ కేంద్రం అని నమోదు చేసుకున్నారో అక్కడికి వెళ్లి పోల్‌ చీటి పొందాలి. ముఖ్యమైన విషయమేమిటంటే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లకండి. అక్కడ నిషేధం. సెల్‌ఫోన్‌లను కేంద్రం బయటే ఉంచి లోపలికి వెళ్లాలి. అక్కడ ఫోన్‌లను చూసుకునేవారు ఉంటారో ఉండరో తెలియదు కాబట్టి ఇంటిపట్టునే ఫోన్‌ పెట్టి వెళ్లడం ఉత్తమం. కొందరు అధికారుల కళ్లు కప్పి ఫోన్‌లు తీసుకెళతారు. ఫోటోలు కూడా తీస్తుంటారు. ఇది చట్ట రీత్యా నేరం. అందుకు పెద్ద శిక్షే పడుతుంది. ఇక పోలింగ్‌ కేంద్రాలలో సిగరేట్‌ తాగడం, పేలుడు పదార్థాలు తీసుకెళ్లడం కూడా నేరమే! ఓటు వేయడం మనందరి హక్కు. ఆ హక్కును వినియోగించుకుందాం!

Updated On 29 Nov 2023 2:56 AM GMT
Ehatv

Ehatv

Next Story