ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో(Delhi liquor policy case) అరెస్ట్‌(Arrest) అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను(MLC Kavitha) ఈడీ అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరిచారు. ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు తర్వాత ఆమెను జస్టిస్‌ కె.ఎం.నాగపాల్‌ ఎదుట హాజరుపరిచారు.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో(Delhi liquor policy case) అరెస్ట్‌(Arrest) అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను(MLC Kavitha) ఈడీ అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరిచారు. ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు తర్వాత ఆమెను జస్టిస్‌ కె.ఎం.నాగపాల్‌ ఎదుట హాజరుపరిచారు. అంతకు ముందు ఈడీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కార్యాయలం దగ్గరకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఈడీ కేంద్ర కార్యాలయం, రౌస్‌ అవెన్యూ కోర్టు దగ్గర కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. భద్రత ఏర్పాటు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, ఈడీ తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేసిందని కవిత చెప్పారు. అక్రమ అరెస్ట్‌పై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు.

Updated On 16 March 2024 2:29 AM GMT
Ehatv

Ehatv

Next Story