మెడికల్ కాలేజ్ సీట్ల స్కాం(Medical College Seat Scam) లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మొత్తం రూ.100 కోట్లకు పైగా స్కాం జరిగినట్టు ఈడీ అభియోగాలు మోపింది. 2016 నుండి 2022 వరకు మెడికల్ కాలేజ్ పీజీ అడ్మిషన్ లలో గోల్‌మాల్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసిన ఈడీ.. ఇటీవల 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మల్లారెడ్డి కాలేజ్ తో పాటు ప్రముఖ కాలేజ్ లపై ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం ఈడీ భారీగా నగదు, కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది.

ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి కుమారులకు ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కాలేజ్ కు ఛైర్మెన్ గా భద్రారెడ్డి, జనరల్ సెక్రెటరీ గా మహేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు పలువురికి ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. వచ్చేవారం మెడికల్ కాలేజ్ యాజమాన్యాలకు ఈడీ నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2022లో కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదుచేసింది.