తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు జరుపుతున్న విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు జరుపుతున్న విషయం తెలిసిందే. హిమాయత్‌సాగర్‌(Himyattsagar)లోని పొంగులేటి ఫాంహౌస్(Ponguleti Farm House), ఆయన కూతురు, బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.

ఢిల్లీ(Delhi) నుంచి వచ్చిన ఈడీ టీం ఒకేసారి 15 చోట్ల చెక్ చేస్తుంది. కస్టమ్స్ సుంకం ఎగవేత, మనీ లాండరింగ్(money laundering) కేసుల్లో భాగంగా ఈడీ సోదాలు జరుపుతోంది. ఇంకా షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, రాఘవా కన్‌స్ట్రక్షన్స్‌ మధ్య సంబంధాలపై కూడా ఈడీ విచారణ జరుపుతోంది. అలాగే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుండి తీసుకున్న ఫేక్ గ్యారెంటీలపై కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారట! వాచీల స్మగ్లింగ్‌ కేసులో పొంగులేటి కొడుకు హర్ష రెడ్డి(Harsha Reddy) ఇంటిని కూడా కస్టమ్స్ అధికారులు చెక్ చేశారు. హర్ష రెడ్డి.. క్రిప్టో, హవాలా ద్వారా ఏకంగా 5 కోట్ల రూపాయల విలువ చేసేఏడు ఖరీదైన వాచ్‌లు కొన్నట్లు తెలిసింది. నవిన్‌ కుమార్‌ అనే వ్యక్తి ద్వారా 100 కోట్లకు రూపాయలకు పైగా స్మగ్లింగ్‌ జరుగుతోందని తెలిసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు రెండు ఖరీదైన వాచీలను పట్టుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్‌ ఫహెర్దీన్‌ ముబీన్‌ అనే వ్యక్తి హాంకాంగ్‌ నుంచి సింగపూర్‌ మీదుగా ఇండియాలోకి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ వాచీలను తీసుకువచ్చిన ముబీన్‌ను అరెస్టు చేశారు. అతన్ని విచారించగా నవీన్ కుమార్ కోసం తీసుకువచ్చినట్లు చెప్పాడు. నవీన్ కుమార్‌ను విచారించినప్పుడు హర్షరెడ్డి పేరు బయటకు వచ్చింది.

ehatv

ehatv

Next Story