మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti srinivas) ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు(ED raids) జరుగుతున్నాయి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti srinivas) ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు(ED raids) జరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi) నుంచి వచ్చిన 16 ఈడీ బృందాలు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఆర్‌పీఎఫ్ బలగాల నడుమ ఈ సోదాలు చేస్తున్నారు. పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలు, ఆయన అనుచరుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు పొంగులేటి స్పందించలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు జరిగాయి. ఆ సమయంలో కాంగ్రెస్ వర్గాలు కేసీఆరే(KCR) దీని వెనుకాల ఉన్నారని ఆరోపించారు. మోడీతో కుట్ర పన్ని కేసీఆర్ ఈ పనిచేయిస్తున్నాయని సోషల్ మీడియాలో కాంగ్రెస్ హ్యాండిల్స్ రాసుకున్నాయి. ఎన్నికలయిపోయాయి, కేసీఆర్ అధికారంలో లేరు.. మరి ఇప్పటి ఈడీ సోదాల వెనుక ఎవరు కుట్రపన్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే ఈడీ సోదాలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డికి ముందు తెలిసినట్లుంది. రెండు రోజుల క్రితం మహేశ్వర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇవే ధృవీకరిస్తున్నాయి. 48 గంటల్లో తెలంగాణ మంత్రుల ఇళ్లకు ఈడీ రాబోతుందని ఆయన ముందే హింట్ ఇచ్చారు. అయితే ఆయన ఈడీ సోదాల సమాచారాన్ని ముందే ఎందుకు లీక్ చేశారు.. ముందే సమాచారం ఇచ్చి ఎవరినైనా కాపాడాలని ఇచ్చారా.. ఎవరిని అప్రమత్తం చేయడానికి లీకులు ఇచ్చారని రాజకీయవిశ్లేషకులు చర్చించుకుంటున్నారు.