హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచే జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో ఈడీ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.

ED Raids in Hyderabad
హైదరాబాద్(Hyderabad) నగరంలో మరోసారి ఈడీ సోదాలు(ED Raids) కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచే జూబ్లీహిల్స్(Jubilee Hills), మణికొండ(Manikonda), పంజాగుట్ట(Panjagutta)లో ఈడీ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. 15 బృందాలతో ఏకకాలంలో ఈడీ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. మలినేని సాంబశివరావు(Malineni Sambashiva Rao)కు సంబంధించి ఇళ్లు, కార్యాలయాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మలినేని సాంబశివరావు.. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్‌ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్‌ట్రాయ్ రోడ్ ప్రాజెక్ట్ అనే నాలుగు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. గతంలో బ్యాంకుల నుంచి లోన్ తిసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సీబీఐ కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈడీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
