వైద్య కళాశాలల్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రకటన విడుదల చేసింది. సోదాలలో మల్లారెడ్డి వైద్య కళాశాలలో 1.4కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలో ఉన్న 2.89కోట్ల అనధికార నగదు సీజ్ చేసినట్లు ఈడీ పేర్కొంది.
వైద్య కళాశాలల్లో(Medical Colleges) ఈడీ సోదాలు(ED Raids) ముగిశాయి. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రకటన విడుదల చేసింది. సోదాలలో మల్లారెడ్డి వైద్య కళాశాల(Mallareddy Medical College)లో 1.4కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలో ఉన్న 2.89కోట్ల అనధికార నగదు సీజ్ చేసినట్లు ఈడీ(ED) పేర్కొంది. మొత్తం 12 వైద్య కళాశాలలు, సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లో.. 16 చోట్ల తనిఖీలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. హైదరాబాద్(Hyderabad), ఖమ్మం(Khammam), కరీంనగర్(Karimnagar), మహబూబ్ నగర్(Mahboobnagar) తో పాటు పలు చోట్లు తనిఖీలు చేసినట్లు పేర్కొంది. పీజీ మెడికల్ సీట్ల(PG Medical Seats)ను బ్లాక్ చేశారనే ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. మనీలాండరింగ్(Money laundering) కింద కేసు నమోదు చేశామని ఈడీ ప్రకటనలో వెల్లడించింది. ఇద్దరు మంత్రులకు చెందిన మమత(Mamatha), మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరిపాం. ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం' అని ఈడీ పేర్కొంది.