ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్రీ శాఖ నుండి కేటీఆర్కు నోటీసులు వచ్చాయి.
తెలంగాణ రాజకీయంగా రచ్చ రచ్చ చేస్తున్న ఫార్ములా - ఈ కేసులో బి.ఆర్.ఎస్. నాయకుడు కె. తారక రామారావు కు విచారణకు హాజరు కావాలని ఈ.డి. నోటీలు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ హై కోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. సోమవారం నాడు ఆ కేసు కోర్టులో మరోసారి హియరింగ్ కు రానుంది.
ఒక వైపు A.C.B. పెట్టిన కేసుకు వ్యతిరేకంగా కేటీఆర్ కోర్టుకు వెళ్ళగా.. ఇప్పుడు అదే కేసులో ఈ.డి. నోటీసులు ఇవ్వడం ఆయనను ఇబ్బందిపెట్టే అంశమే. అయితే జనవరి 7 న విచారణకు హాజరు కావాలని ఈ.డి. తన నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో I.A.S. ఆఫీసర్ అరవింద్ కుమార్(IAS Aravind kumar), చీఫ్ ఇంజనీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డి(BLN Reddy) లకు కూడా ఈ.డి. నోటీసులు ఇచ్చింది.
ఫార్ములా -ఈ రెస్ జరపడంలో భాగంగా చేసుకున్న కాంట్రాక్ట్ కొరకు చేసిన డబ్బు చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదురుకుంటున్నాడు కేటీఆర్ అయితే ఆయన మాత్రం నేను ఏ నేరానికి పాల్పడలేదు అని చెప్తూ వస్తున్నారు. ఎటువంటి విచారణకైనా సిద్ధమే అని కె.టీ.ఆర్. ఇంతకుముందే చెప్పారు.