ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతూనే ఉంది .. లిక్కర్ స్కాంలో వేగం పెంచిన ఈడీ తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కవితకు నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది. ఈ నెల 9న ఢిల్లీ రావాలని..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతూనే ఉంది .. లిక్కర్ స్కాంలో వేగం పెంచిన ఈడీ తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కవితకు నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది. ఈ నెల 9న ఢిల్లీ రావాలని.. విచారణకు హాజరవ్వాలని సూచించింది. రామచంద్ర పిళ్లైను విచారించి అరెస్ట్ చేసిన ఈడీ కీలక అంశాలను వెల్లడించింది. రామచంద్ర పిళ్లై తాను కవితకు బినామీగా అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది.
ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టింది. ఈ స్కామ్‌లో కవితకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించాడని సమాచారం . తాను కవిత బినామీగా అని రామచంద్ర పిళ్లై తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ లిక్కర్ స్కామ్ లో కోట్లాది రూపాయలు చేతులు మారాయని , సౌత్ గ్రూప్ కు లీడర్ గా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీచేయడం చర్చనీయాంశమైంది.
మరోవైపు ఈ నెల 10వ తేదీన కవిత చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు నిర్ణయించారు. ఇప్పుడు అదే రోజున విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈడీ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో కవిత ప్రస్తావన చేసింది. కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం మేరకు భాగస్వామిగా ఉన్నారని వెల్లడించింది. ప్రేమ్‌రాహుల్‌కు కూడా 32. శాతం వాటా ఉందని తెలిపింది. ఇండోస్పిరిట్స్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్‌కు 35శాతం వాటా ఉన్నట్లు వివరించింది. సౌత్ గ్రూప్‌కు ఆప్ అగ్ర నేతలకు మధ్య స్పష్టమైన రాజకీయ అవగాహన ఉందని ఈడీ తెలిపింది. అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్ ఇద్దరూ కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి తరఫున బినామీలుగా పెట్టుబడులు పెట్టారని వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు.
ఈడీ నోటిసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత మాత్రం ఈ స్కాంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని స్పష్టం చేస్తున్నారు. ఎల్లుండి జంతర్ మంతర్ ధర్నా ఉన్నందున రేపటి విచారణ గురించి న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానని కవిత అన్నారు. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తానన్న కవిత ..ఇలా ఇబ్బంది పెట్టి బీజేపీ ఏం సాధిస్తుందనన్నారు. అయితే ఇప్పుడు పదో తేదిన ఏం జరగబోతుందోనని కవిత ఢిల్లీ వెళతారా లేదా అనే విషయంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.