తెలంగాణ(Telangana)లో రాజకీయ దుమారాలు చెలరేగుతున్నాయి. సీఎం రేవంత్‌(CM Revanth) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిత్యం ఎదో ఒక అంశంపై వివాదం నెలకొంటోంది.

తెలంగాణ(Telangana)లో రాజకీయ దుమారాలు చెలరేగుతున్నాయి. సీఎం రేవంత్‌(CM Revanth) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిత్యం ఎదో ఒక అంశంపై వివాదం నెలకొంటోంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారంపై ఈడీ(ED)కి ఫిర్యాదు వెళ్లింది. ఈడీ కూడా ఆ ఫిర్యాదును స్వీకరించడంతో ఇప్పుడు ఆసక్తిరంగా మారింది. అమెరికా(America)లో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ పలు కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి స్వచ్ఛ్‌ బయో డీల్ సంస్థతో ఎంవోయూ(MOU)చేసుకున్నారు. ఈ డీల్ పై పెద్ద వివాదం సాగింది. స్వచ్ఛ్‌ బయో డీల్ సంస్థలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల జగదీష్‌రెడ్డి(jagadeesh Reddy)డైరెక్టర్‌గా ఉన్నారు. అదే కంపెనీలో ఉన్న ఇతర డైరెక్టర్లు కూడా రేవంత్ అనుచరులనే వార్తలు వచ్చాయి. అంతేకాదు నెల రోజుల క్రితమే ఈ సంస్థ ఏర్పాటైందని బీఆర్ఎస్(BRS) ఆరోపించింది. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు విడుదల చేసింది. అయితే 10 లక్షల క్యాపిటల్ ఇన్వెస్ట్‌తో ప్రారంభమైన ఈ కంపెనీ తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని బీఆర్‌ఎస్ విమర్శించింది. అంతేకాకుండా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి బీఆర్‌ఎస్‌ నేత, ఆ పార్టీ సోషల్‌ మీడియా ఇంచార్జి మన్న క్రిషంగ్‌ వెళ్లి ఈ ఒప్పందంపై ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి, అతని సోదరుడు జగదీష్‌రెడ్డికి సంబంధించిన ఈ కంపెనీపై ఈడీ విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఈడీ కూడా స్వీకరించడంతో ఇది కాస్త చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై విచారిస్తామని ఈడీ అధికారులు తమకు హామీ ఇచ్చారని క్రిషాంక్‌ చెప్పడంతో ఈడీ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఒక వేళ ఈడీ విచారణ చేపడితే ఎలా ఉంటుందోనని కాంగ్రెస్‌(Congress) వర్గంలో ఆందోళన నెలకొంది.

ehatv

ehatv

Next Story