ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వానికి గ‌ట్టి షాక్ త‌గిలింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) దృష్ట్యా లబ్ధిదారుల ఇంటి వద్దకు ప్రభుత్వ సహాయ పథకాల పంపిణీని ఉపసంహరించుకోవాలని భారత ఎన్నికల సంఘం రాష్ట్రాన్ని కోరింది.

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వానికి గ‌ట్టి షాక్ త‌గిలింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) దృష్ట్యా లబ్ధిదారుల ఇంటి వద్దకు ప్రభుత్వ సహాయ పథకాల పంపిణీని ఉపసంహరించుకోవాలని భారత ఎన్నికల సంఘం రాష్ట్రాన్ని కోరింది. పింఛన్ల వంటి సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందకుండా చూడాలని ఈసీ ఏపీ ప్రభుత్వానికి సర్క్యులర్ జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నంత వరకు గ్రామ వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు, ఇత‌ర పరికరాలను తిరిగి తీసుకోవాలని ECI ప్రభుత్వాన్ని కోరింది. పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సహాయాన్ని పంపిణీ చేయకుండా ECI నిలిపివేసిన విధంగానే ఈ నిర్ణయం కూడా ఉండ‌టం విశేషం. వివిధ రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌తో స‌హా అంతర్జాతీయ గుర్తింపు పొందిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ కోవిడ్ 19 మహమ్మారి సమయంలో పథకాలను ప్రజలకు అందజేయడానికి ప్రభుత్వానికి ఎంత‌గానో ఉపయోగపడింది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిన తర్వాత వారు త‌మ వ్యాఖ్య‌ల‌పై వెనక్కి తగ్గారు.

Updated On 30 March 2024 8:50 AM GMT
Yagnik

Yagnik

Next Story