మార్చి 18 సాయంత్రం 6:14 గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లాలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.

మార్చి 18 సాయంత్రం 6:14 గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లాలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో రిక్టర్ స్కేలుపై 2.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. భారత ప్రామాణిక కాలమానం ప్రకారం 6:14 గంటలకు 5 కి.మీ లోతులో భూ ప్రకంపనలు సంభవించింద‌ని NCS నివేదించింది.

నిన్న తెలంగాణతో పాటు అస్సాం, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. అయితే.. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 కంటే తక్కువగా న‌మోద‌వ‌డం విశేషం.

భారతదేశం నాలుగు భూకంప మండలాలుగా విభజించబడింది. జోన్ II, జోన్ III, జోన్ IV, జోన్ V. ఈ జోన్‌లలో జోన్ V కింద ఉన్న ప్రాంతాలలో భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉంది. జోన్ II ప్రాంతాల‌లో భూకంపాల‌కు అతి తక్కువ అవకాశం ఉంది. తెలంగాణలోని చాలా ప్రాంతాలు జోన్ II కిందకు వస్తాయి కాబట్టి, రాష్ట్రంలో భూకంపాలు తక్కువగా ఉంటాయి. అయితే.. రాష్ట్రంలోని కొన్ని తూర్పు ప్రాంతాలు జోన్ III కిందకు వస్తాయి. భారతదేశంలో భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో చాలా ప్రాంతాలు జోన్ V పరిధిలోకి వస్తాయి.

Updated On 18 March 2024 11:57 PM GMT
Yagnik

Yagnik

Next Story