సంగారెడ్డి జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని న్యాల్‌కల్ మండలంలోని న్యాల్ కల్, ముంగి గ్రామాల్లో శనివారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించింది.
సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని న్యాల్‌కల్ మండలంలోని న్యాల్ కల్(Nyalkal Mandal), ముంగి గ్రామాల్లో శనివారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించింది. భూ ప్రకంపనల దాటికి ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. భూ ప్రకంపన(Earthquake )ల సమయంలో.. వింత వింత శబ్దాలు వచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందన్నది కాసేపటి వరకూ ఏమీ అర్థం కాలేదని.. చాలా భయపడిపోయినట్టు వివరించారు. కాగా.. ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. దీంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఈ పరిణామంపై సంబంధిత శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.