తెలంగాణ గవర్నర్(Telangana Governor) తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఆమోదించారు.
తెలంగాణ గవర్నర్(Telangana Governor) తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఆమోదించారు. తెలంగాణకు కొత్త గవర్నర్(Telangana New Governor) ను నియమించే వరకు జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(Governor C P Radhakrishnan)కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పగించారు ద్రౌపది ముర్ము.
తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ రాధాకృష్ణనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్ గవర్నర్‌గా కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల సారాంశం.