బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు ఆ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌(Dr. Dasoju Sravan). కేసీఆర్‌(KCR) హ్యాట్రిక్‌(Hatrick) ముఖ్యమంత్రి అవుతారని, పెయిడ్ ఎగ్జిట్ పోల్స్(Exist Polls) తో కాంగ్రెస్ శాడిస్టిక్ ఆనందం పొందుతోందని, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా కాంగ్రెస్(congress) పార్టీ నాయకులు తమ లేకి తనాన్ని ప్రదర్శిస్తూ కేసీఆర్ మీద బట్టకాల్చి మీదే వేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు ఆ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌(Dr. Dasoju Sravan). కేసీఆర్‌(KCR) హ్యాట్రిక్‌(Hatrick) ముఖ్యమంత్రి అవుతారని, పెయిడ్ ఎగ్జిట్ పోల్స్(Exist Polls) తో కాంగ్రెస్ శాడిస్టిక్ ఆనందం పొందుతోందని, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా కాంగ్రెస్(congress) పార్టీ నాయకులు తమ లేకి తనాన్ని ప్రదర్శిస్తూ కేసీఆర్ మీద బట్టకాల్చి మీదే వేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు దఫాలుగా కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి ఉద్యమ ప్రస్థానం మూడోసారి తప్పకుండా కొనసాగుతుందన్నారు. అవుట్ అఫ్ టర్మ్ లో కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం ఆరువేల కోట్ల రూపాయిలు బిల్లులు ఇప్పించారని కాంగ్రెస్ పార్టీ ఈసీ కి లేఖ రాయడం వారి చిల్లర లేకితనానికి పరాకాష్ట అని, ఇది దుర్మార్గమైన తప్పుడు చిల్లర ప్రచారమని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి దద్దమ్మ ఇలాంటి పనులు చేశారంటే అనుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్య పద్దతులు, ప్రోటోకాల్ తెలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) లాంటి నాయకులు ఇలాంటి చిల్లర లేఖపై ఎలా సంతకం పెట్టారని దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. కర్నాటక గద్దలు, ఏపీ నుంచి పచ్చపార్టీ గద్దలు, ఢిల్లీ గద్దలు తెలంగాణను కమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిదని చెప్పారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్కు ఉన్నది పేగుబంధమని, తెలంగాణని దేశంలో ఎక్కడాలెన్ని గొప్ప అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు నడిపారని శ్లాఘించారు. ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాట్‌ పోల్స్ కి ఎప్పుడూ తేడా వుంటుందని, 2 కోట్ల 32 లక్షల మంది ఓట్లు వేస్తె 26 వేల మంది సాంపిల్స్ తెచ్చి తెలంగాణ మొత్తం ఇలా వుందని చెబితే ఎలా నమ్మాలి అని శ్రవణ్‌ అన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని దాసోజు శ్రవణ్‌ స్పష్టం చేశారు

Updated On 2 Dec 2023 8:08 AM GMT
Ehatv

Ehatv

Next Story