ఫార్మాసిటీ(Pharmacity) విషయంలో పంతాలకు పోవద్దని సీఎం రేవంత్‌రెడ్డికి(CM revanth reddy) గతంలోనే చెప్పానని డీకే అరుణ అన్నారు.

ఫార్మాసిటీ(Pharmacity) విషయంలో పంతాలకు పోవద్దని సీఎం రేవంత్‌రెడ్డికి(CM revanth reddy) గతంలోనే చెప్పానని డీకే అరుణ అన్నారు. లగచర్ల ఘటనపై ఎలాంటి కుట్ర కోణం లేదన్నారు. ఫార్మాకంపెనీల కోసం భూమిని కోల్పోతున్న రైతుల్లో అన్ని పార్టీల వాళ్లున్నారన్నారు. లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదు.

ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉందని.. లగచర్ల ఘటనలో అన్ని పార్టీలకు మద్దతిచ్చే రైతులు ఉన్నారని డీకే అరుణ(DK Aruna) అన్నారు. తాను గతంలోనే ఫార్మ కంపెనీలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతుల ధర్నాలో పాల్గొన్నానన్నారు. ఆ ధర్నాలో రైతులంతా ముక్తకంఠంతో తమ భూములు ఇచ్చేది లేదన్నారు. ప్రాణాలు పోయినా సరే ఫార్మ కంపెనీలను అడ్డుకుంటామని రైతులు అంటున్నారు. ప్రభుత్వ భూముల్లో(Government lands) కంపెనీలు పెట్టాలని.. రైతుల భూములు లాక్కుంటే వారి జీవనాధారం పోతుందని డీకే అరుణ అన్నారు. ఎంత ప్యాకేజీ ఇచ్చినా.. భూములు ఇవ్వబోమని ఆనాడే తేల్చి చెప్పారని అని డీకే అరుణ తెలిపారు. రైతుల వ్యతిరేకతతో సీఎం రేవంత్‌ ఫస్ట్రేషన్‌లో ఉన్నాడని డీకే అరుణ అన్నారు. కుట్ర కోణం ఉండి ఉంటే ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఫెయిలైందని విమర్శించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకంత ప్రేమ అని నిలదీశారు. అసలు ఆ ప్రాజెక్టు ఎవరిది.. దాని వెనుక ఉన్నది ఎవరో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story