డోర్నకల్(Dornacle) ఎమ్మెల్యే రెడ్యా నాయక్(MLA Redya Naik) కు నిరసన సెగ తగిలింది. చిన్న గూడూరు మండలం విస్సంపల్లిలో పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం రసాభాసగా మారాయి. గ్రామంలో అర్హులందరికీ దళిత బంధు(Dalita bandhu) ఇవ్వాలని యువకుల నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే వారిపై మండిపడ్డారు.

MLA Redya Naik
డోర్నకల్(Dornakal) ఎమ్మెల్యే రెడ్యా నాయక్(MLA Redya Naik) కు నిరసన సెగ తగిలింది. చిన్న గూడూరు మండలం విస్సంపల్లిలో పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం రసాభాసగా మారాయి. గ్రామంలో అర్హులందరికీ దళిత బంధు(Dalita bandhu) ఇవ్వాలని యువకుల నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే వారిపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు, అభిమానులకు మాత్రమే అన్ని పథకాలు ఇస్తామని.. వేరే పార్టీ వారికి ఇవ్వమని రెడ్యానాయక్ తేల్చి చెప్పారు.
ఎవరు లొల్లి పెట్టినా భయపడేది లేదన్నారు. నేను ఎమ్మెల్యే ఐనప్పుడు ఎవరూ పుట్టలేదన్నారు. మాది కూడా రాజకీయ పార్టీనే.. మాకు ఓటు వేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసేది.. మరలా ప్రజలు గెలిపిస్తారని మాత్రమేనని.. ఇదే రాజకీయ సూత్రం అన్నారు. నన్ను ఓడించడానికి గతంలో పనిచేశారు.. ఇప్పుడు పని చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా డోర్నకల్ నియోజక వర్గంలో గెలిచేది నేనే అన్నారు.
