క్రీడాకారులకు చేయూత ను అందించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాలని యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్(Talasani sai kiran yadav) కోరారు.

క్రీడాకారులకు చేయూత ను అందించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాలని యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్(Talasani sai kiran yadav) కోరారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి(West Maredpalli) లోని తమ నివాసం వద్ద పవర్ లిఫ్టర్ వైష్ణవి మహేష్(Power lifter Vaishnave Mahesh)కు తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అక్టోబర్ 4 నుండి 13 వ తేదీ వరకు దక్షిణాఫ్రికా లో జరిగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు వైష్ణవి మహేష్ ఎంపికైంది. ఈ పోటీలకు హాజరయ్యేందుకు ఆర్ధికంగా కొంత ఇబ్బందిపడుతున్న విషయాన్ని తెలుసుకున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ ఈ మేరకు తలసాని ట్రస్ట్ ద్వారా 2 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆమెకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ అనేకమంది నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికీ, వారికి సరైన ప్రోత్సాహం లభించకపోవడం వలన రాణించలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వైష్ణవి మహేష్ కు గత 4, 5 సంవత్సరాల నుండి పవర్ లిఫ్టర్ గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ప్రతిభ చాటే విధంగా ప్రోత్సహిస్తూ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎప్పటికైనా అంతర్జాతీయ వేదికలపై వైష్ణవి మహేష్‌కు తన సత్తా చాటే అవకాశం లభిస్తుందనే పూర్తి నమ్మకం తనకు ఉందని, అది నిజం కాబోతుందని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మెడల్స్ ను సాధించిందని చెప్పారు. ఆమె కష్టానికి ఫలితంగా అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని తెలిపారు. కామన్వెల్త్ పోటీలలో కూడా తన ప్రతిభను చాటుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ప్రోత్సాహాన్ని మరువలేను: వైష్ణవి

పవర్ లిఫ్టింగ్ లో తాను అంతర్జాతీయ(International)స్థాయిలో రాణించే విధంగా తలసాని ట్రస్ట్(Talasani Trust),తలసాని సాయి కిరణ్ యాదవ్ అందించిన సాయం, ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేనని పవర్ లిఫ్టర్ వైష్ణవి మహేష్ అన్నారు. తాను పవర్ లిఫ్టర్ గా కెరియర్ ను ప్రారంభించిన నాటి నుండి అనేక సందర్భాలలో అన్ని విధాలుగా సహాయం అందిస్తూ వస్తున్నారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపింది. కామన్వెల్త్ పోటీలలో మెడల్ ను సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.

ehatv

ehatv

Next Story