హైదరాబాద్ 11వ తేదీన దోమల్‌గూడ(Domalguda) పోలీస్ స్టేషన్ పరిధి రోజ్ కాలనీలో(Rose Colony) గ్యాస్ లీకేజీ(Gas Leakage) ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 12వ తేదీన శరణ్య(Sharanya) అనే బాలిక మృతి చెందింది. మిగతావారు తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్నారు.

Gas Cylinder
హైదరాబాద్ 11వ తేదీన దోమల్‌గూడ(Domalguda) పోలీస్ స్టేషన్ పరిధి రోజ్ కాలనీలో(Rose Colony) గ్యాస్ లీకేజీ(Gas Leakage) ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 12వ తేదీన శరణ్య(Sharanya) అనే బాలిక మృతి చెందింది. మిగతావారు తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం మరో ముగ్గురు మృతిచెందారు. మృతిచెందిన వారిని పద్మ (53), ఆమె కూతురు ధనలక్ష్మి (28), ధనలక్ష్మి కుమారుడు అభినవ్ (7) లుగా గుర్తించారు. 12వ తేదీన మృతిచెందిన శరణ్య.. ధనలక్ష్మికి కూతురు. దీంతో గ్యాస్ లీకేజీ అయి మంటలు అంటుకున్న ఘటనలో మృతులు నాలుగుకు చేరాయి. పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
