తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Telangana Assembly Election Poling)కు చివరి దశకు వచ్చేసింది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణ ఎన్నికలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. కేసీఆర్(KTR) హ్యాట్రిక్ కొడతారా? లేక కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రజలు జైకొడతరా? అన్నది ఉత్కంఠ రేపుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Telangana Assembly Election Poling)కు చివరి దశకు వచ్చేసింది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణ ఎన్నికలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. కేసీఆర్(KTR) హ్యాట్రిక్ కొడతారా? లేక కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రజలు జైకొడతరా? అన్నది ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణ(Telangana)తో పాటు మరో నాలుగు రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గడ్, మిజోరాం ఎన్నికల ఫలితాలపై కూడా దేశ ప్రజలు ఆసక్తిని పెంచుకున్నారు. ఈ ఎన్నికలను ప్రీ ఫైనల్‌గా భావిస్తున్నారు. సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. వాటిని బట్టి ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తున్నారన్నదానిపై ఒక అంచనాకు రావచ్చు. ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికల్లో ఓట్లు ఎలా పడ్డాయన్నదానిపై ఓ అంచనాకు రావడం. దీన్ని మీడియా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహిస్తాయి. ముందుగా ఓటింగ్ సరళి గురించి చెబుతూ తర్వాత ఎవరు గెలుస్తారన్నది అంచనా వేస్తారు. ఈ ఎగ్జిట్‌పోల్స్‌చెప్పినట్టుగానే ఫలితాలు ఉంటాయన్న గ్యారంటీ ఏమీ లేదు. అప్పుడప్పుడు ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు కూడా తప్పుతాయి. ఎన్నికల ముందు కూడా ఇలాగే ఓటింగ్ సర్వే చేస్తారు. దీన్ని ప్రీ పోల్ సర్వే అంటారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే ఇలాంటి సర్వేలు జరుగుతాయి. పోలింగ్ తేది దగ్గరపడుతున్నప్పుడు నియోజక వర్గాల వారీగా కొంతమంది ఓటర్లను కలుసుకుని వారి మనోగతాన్ని తెలుసుకుంటారు. అన్నింటిని క్రోడికరించి ప్రీపోల్ సర్వే ఫలితాలను వెల్లడిస్తారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అలా కాదు. పోలింగ్ జరిగిన రోజే ఓటరు మనోగతం తెలుసుకుని సర్వే చేసి చెబుతారు. చాలా మంది ఎవరికి ఓటు వేశామన్నది బయటకు చెప్పరు. ఈ విషయంలో గుంభనంగా ఉంటారు. అందుకే ఎగ్జిట్ పోల్స్ కూడా కరెక్ట్‌గా వస్తాయని చెప్పలేము.