ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మేడిగూడ వాసులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి దగ్గరలోనే సాథ్నాల ప్రాజెక్ట్‌ ఉండడంతో రెండు పంటలు పండుతాయి. పత్తి, సోయా, ఇతర పంటలను ఈ గ్రామస్తులు సాగు చేస్తారు. ఈ క్రమంలో ఆ ఊరిలో ఎవరికైనా అనారోగ్య సమస్య ఏర్పడితే ఆ ఊరిలో ఉన్న హనుమాన్‌టెంపుల్, పోచమ్మ ఆలయానికి ఆవును విడిచిపెట్టే ఆచారంగా కొనసాగుతోంది. అలా ఆవులను వదిలేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు.

జనరల్‌గా మనం గ్రామాల్లో కొందరు స్వాతంత్ర్య సమర యోధులు, దివంగత రాజకీయ పార్టీల విగ్రహాలు లేదా ఆ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేసిన ప్రముఖుల విగ్రహాలు చూస్తాం. వారి జయంతులు, వర్ధంతులను నిర్వహించుకంటారు. అయితే ఓ గ్రామంలో ఆవు విగ్రహాన్ని(Cow Statue) ప్రతిష్టించి స్థానికులు పూజలు చేస్తున్నారు. ఎక్కడో కాదు.. ఆదిలాబాద్ జిల్లా(Adilabad) జైనథ్‌(Jainad )మండలం మేడిగూడలో ఈ ఆవు విగ్రహానికి అక్కడి వారు పూజలు చేస్తారు.

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మేడిగూడ వాసులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి దగ్గరలోనే సాథ్నాల ప్రాజెక్ట్‌ ఉండడంతో రెండు పంటలు పండుతాయి. పత్తి, సోయా, ఇతర పంటలను ఈ గ్రామస్తులు సాగు చేస్తారు. ఈ క్రమంలో ఆ ఊరిలో ఎవరికైనా అనారోగ్య సమస్య ఏర్పడితే ఆ ఊరిలో ఉన్న హనుమాన్‌టెంపుల్, పోచమ్మ ఆలయానికి ఆవును విడిచిపెట్టే ఆచారంగా కొనసాగుతోంది. అలా ఆవులను వదిలేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం ఇలాగే మొక్కుకుని ఆవును ఊరికి వదిలిపెట్టాడు. ఆ ఆవు ఆదాయన్ని అభివృద్ధికి ఉపయోగించారు. ఆ ఆవు ఈనడంతో పుట్టిన దూడలను విక్రయించడంతో కూడా ఆదాయం సమకూరుతోంది. క్రమక్రమంగా ఆ ఆవు సంతతి పెరుగుతూవచ్చింది. దీంతో మేడిగూడకు ఆవు కామధేనువులా మారింది. కొద్ది కాలం తర్వాత అనారోగ్యంతో ఆవు మృతి చెందడంతో దాని జ్ఞాపకార్థం ప్రధాని కూడలిలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ ఆవును దైవ సమానం ఆరాధిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కనే ఆవు విగ్రహం ఉండడంతో చుట్టుపక్కల గ్రామాలకు దానిని ఆసక్తి చూస్తున్నారు. ఆవును దైవంగా కొలవడంతో మేడిగూడ గ్రామస్తులను పలువురు అభినందిస్తున్నారు.

Updated On 8 Dec 2023 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story