తెలంగాణలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

DK Shivakumar visited Telangana for two days
తెలంగాణ(Telangana)లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shiva Kumar) రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన రేపు, ఎల్లుండి తెలంగాణ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్నారు. రేపు బెంగుళూరు(Bengaluru) నుంచి ఉదయం హైదరాబాద్(Hyderabad) కు చేరుకొని 12 గంటలకు స్టేషన్ ఘన్ పూర్(Station Ghanpur) నియోజక వర్గం కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు.
అనంతరం అక్కడ నుంచి వర్ధన్న పేట(Vardannapeta) నియోజక వర్గంలో తర్వాత వరంగల్ వెస్ట్(Warangal West) నియోజక వర్గాలలో ప్రచార సభల్లో పాల్గొని రాత్రి అంబర్ పేట(Amberpet) నియోజక వర్గం కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఇక 25వ తేదీన హైదరాబాద్ లోని పలు నియోజక వర్గాలలో రోడ్ షో లు, కార్నర్ మీటింగ్ లలో పాల్గొంటారు.
