ప్రముఖ సినీ నటి, తెలుగుదేశం పార్టీ మాజీ నాయకురాలు దివ్యవాణి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే దివ్యవాణికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.
ప్రముఖ సినీ నటి, తెలుగుదేశం(TDP) పార్టీ మాజీ నాయకురాలు దివ్యవాణి(Divya Vani) కాంగ్రెస్ పార్టీ(Congress Party) లో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే(Manikrao Thackrey) దివ్యవాణికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన దివ్యవాణి.. గతేడాది పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కొందరి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమె పార్టీని వీడారు.
ఇటీవల ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest)ను కూడా ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ వార్త షాక్‌కు గురిచేసిందని చెప్పారు. చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు ఉందని అన్నారు. లీడర్‌గా తాను చంద్రబాబును గౌరవిస్తారని.. ఆయనను ఇలాంటి స్థితిలో చూడాల్సి రావడం బాధకరమని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానం నన్ను బాధించిందని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్షకు అర్హులేనని అన్నారు. అయితే అది నిర్దారణ అయి బయటకు రాకముందే.. ఇలాంటి చర్యలకు పాల్పడటం, తక్కువస్థాయి మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ పరిణామాలను తాను ఖండిస్తున్నానని చెప్పారు.