మోసగాళ్లు రోజుకో కొత్త స్కీమ్‌తో వస్తున్నారు. చాలా తెలివిమీరిపోయారు.

మోసగాళ్లు రోజుకో కొత్త స్కీమ్‌తో వస్తున్నారు. చాలా తెలివిమీరిపోయారు. అధికారుల వేషంతో అమాయక ప్రజలను బోల్తా కొట్టించిన వైనాలు ఎన్నింటినో చూశాం. ఇప్పుడు ఆర్టీఏ అధికారులమని చెప్పి ఓ పసుపు లోడ్‌ లారీని(Turmeric Load Lorry) హైజాక్‌ చేశారు. డ్రైవర్‌కు మత్తుమందు ఇచ్చి పసుపు బస్తాలను మరో వాహనంలోకి మార్చే ప్రయత్నం చేశారు. ఇక్కడే పోలీసులకు దొరికిపోయారు. ఈ సంఘటన నిజామాబాద్‌(Nijamabad) జిల్లాలో జరిగింది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి పసుపు లోడ్‌తో ఓ లారీ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు(Guntur) బయలుదేరింది. ఇందల్‌వాయి టోల్‌ప్లాజా దగ్గరకు రాగానే ఓ కారులో కొందరు వ్యక్తులు వచ్చి తాము ఆర్టీఏ అధికారులమని చెప్పి లారీని ఆపారు. లారీ ఆపిన డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చారు. అతడు స్పృహ కోల్పోయిన తర్వాత అతడిని లారీ నుంచి దించేశారు. లారీని హైజాక్‌ చేశారు. ఆ లారీని మళ్లీ నిజామాబాద్‌కు తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలో పలు చోట్ల పసుపు అమ్మారు. అటు తర్వాత నవీపేట మండలం జన్నేపల్లికి తీసుకెళ్లారు. అక్కడ కూడా కొంచెం సరుకు అమ్మారు. మిగిలిన పసుపు బస్తాలను మరో మూడు వాహనాల్లోకి నింపుతున్నారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న పోలసీఉలు అక్కడికి వచ్చారు. పోలీసుల రాక గమనించిన డ్రైవర్‌ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. మూడు వాహనాలను, డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లారీలో మొత్తం 50 లక్షల రూపాయల విలువ చేసే లోడ్‌ ఉందట!

Eha Tv

Eha Tv

Next Story