మంత్రి కొండా సురేఖ(Konda surekha) చేసిన వ్యాఖ్యలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.

మంత్రి కొండా సురేఖ(Konda surekha) చేసిన వ్యాఖ్యలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రియాక్టయ్యారు. దర్శక నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ(Ram gopal varma) అయితే కొండా సురేఖకు గట్టిగానే క్లాస్‌ తీసుకున్నారు. 'నాగార్జున(Nagarjuna) కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు. KTR ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటంలేదు ? తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని(Naga chaithaya) అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి?4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము' అంటూ వర్మ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.





Eha Tv

Eha Tv

Next Story