పుష్ప2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వచ్చారు. థియేటర్లోకి వెళ్లారు. ఆయన అక్కడికి వస్తున్నప్పుడు పోలీసులు స్వాగతం పలికారు.

పుష్ప2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వచ్చారు. థియేటర్లోకి వెళ్లారు. ఆయన అక్కడికి వస్తున్నప్పుడు పోలీసులు స్వాగతం పలికారు. వాహనం లోపలికి వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. నేరుగా ఆయనతో పాటుగా బాల్కనీ వరకూ వచ్చారు. అల్లు అర్జున్ థియేటర్లో అడుగుపెట్టిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో బాధితురాలు ప్రమాదం బారిన పడ్డారు. ఇదంతా అర్థం చేసుకోవచ్చు.

పోలీసుల ఎఫ్ఐఆర్ కూడా ఇందుకు సాక్ష్యం. సంధ్యా థియేటర్ వద్ద డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.20 నుంచి 9.50 మధ్యలో తొక్కిసలాట జరిగినట్టు పోలీసుల రిపోర్ట్ చెబుతోంది. అంటే ఆ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ లోపల ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ సరిగ్గా థియేటర్ ప్రాంగణంలోకి 9.00 ప్రాంతానికే చేరుకున్నారు. నేరగా థియేటర్లో అడుగుపెట్టారు. ఆయన లోపలికి వెళ్లిన తర్వాత బయట ప్రమాదం జరిగింది.

కొద్దిసేపటికి 10గంటల సమయంలో పోలీసులు దగ్గరుండి అల్లు అర్జున్ ను థియేటర్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు మార్గం చూపించారు. అంటే సంధ్యా థియేటర్ దగ్గరకు బన్నీ వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు పోలీసులే బాధ్యత తీసుకున్నారు. పోలీసులే దగ్గరుండి థియేటర్లోకి తీసుకెళ్లి, బయటకు తరలించిన తర్వాత మధ్యలో ఘటన జరిగితే బాధ్యత ఎవరిదీ. ఎవరు జాగ్రత్తలు పాటించాలి. పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న థియేటర్ వద్ద ఘటనలో ఎవరి పాత్ర అనేది అందరూ ఆలోచించాల్సిన అంశాలు.

కానీ అనుకోని ప్రమాదం జరిగిపోయింది. ఊహించని నష్టం జరిగింది. దానికి బాధ్యత లేదంటూ చేతులు దులుపుకుంటే అది బాధ్యతారాహిత్యం. అధికార యంత్రాంగం కొంతమేర అదే పనిలో కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సమాధానం ఇచ్చామంటూ ఓ లేఖను విడుదల చేశారు. కానీ సంధ్యా థియేటర్ నుంచి ఆ సమాచారం సినిమా హీరోకి చేరిందా లేదా అన్నది పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు. సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటుగా తాము ఈ సమాచారం సినీ యూనిట్‌కి కూడా అందించాలన్న ఆలోచన ఎందుకు చేయలేదన్నది ప్రశ్నగా మారింది.

పోలీసులు చెప్తున్నట్లు సంధ్యా థియేటర్ వద్ద తగిన భద్రత కల్పించలేని పరిస్థితి ఉంటే సదరు సమాచారం అక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న పుష్ప ది రూలింగ్ యూనిట్ కి అందించి, వారిని నిలువరించాల్సిన బాధ్యత ఎవరిది. బయలుదేరే ముందయినా గానీ ఫలానా కారణంతో ఆగిపోవాలని చెప్పే ప్రయత్నం చేశారా. అలాంటి నోటీసులు ఇచ్చారా. అలాంటిదేమీ చేయకుండా, చివరకు థియేటర్ వద్దకు వచ్చినప్పుడు కూడా స్వాగతం పలికి, వెళ్లేందుకు సాదరంగా పంపించి, ప్రమాదానికి బాధ్యత మాత్రం నెట్టేసే ప్రయత్నం చేయడం ఏవిధంగా సమంజసం అవుతుంది. పోలీస్‌శాఖ సరిగా పనిచేయకపోవడంతో సమాజంలో జరిగే దోపిడీలకు, రేప్‌లకు, నేరాలన్నింటికీ పోలీసులను బాధ్యులను చేయడం ఏమేరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

అల్లు అర్జున్ తో పాటుగా సినిమా బృందం థియేటర్ వరకూ వస్తున్న విషయం తెలిసినప్పటికీ విస్మరించిందెవరు. సినీ యూనిట్ వస్తుందని తెలిసినా తగినంత యంత్రాంగాన్ని మోహరించి, అవసరమైన మేర భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిదీ. ఘటనాస్థలంలో లేని వ్యక్తికి ఆపాదించి, చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం ఎలా సమర్థనీయం అవుతుంది. అల్లు అర్జున్ థియేటర్‌లో అడుగుపెట్టి సినిమా చూస్తుండగా బయట ఏ నేరం జరిగినా సినిమా చూస్తున్న వాళ్లకే ఆపాదిస్తారా. చట్టం రీత్యానే కాకుండా కనీసం చిన్నపాటి లాజిక్కుకి కూడా పొసగని రీతిలో సాగుతున్న ప్రచారం వెనుక మర్మమేంటి. అనేకనేక సందేహాలకు తావిచ్చేలా వ్యవహారం సాగుతోంది. ఏమయినా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంలో అసలు నిర్లక్ష్యం ఎవరిదన్నది బయటపడుతుంది. సమాచారం ముందే తెలిసినా ఉదాశీనంగా ఉన్న యంత్రాంగం వైఖరి వెల్లడవుతుంది. అంతవరకూ ఓపిక పడదాం. ఒకవేళ రాజకీయనేతల బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగితే అది రాజకీయనేతలకు వర్తిస్తుందా అని కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ehatv

ehatv

Next Story