హీరో అల్లు అర్జున్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి.

అతనేమైనా భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పోరాడి ఇండియాను గెలిపించి వచ్చాడా?.. సినిమా చేశాడు.. డబ్బులు సంపాదించాడు' హీరో అల్లు అర్జున్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి.

ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో సీఎం ఈ మాటలు అన్నారు. హైదరాబాద్ సంధ్య థియేటర్‌(sandhya theater) ఘటనలో ఓ మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడని చెబుతూ, ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఘటనపై క్రిమినల్‌ కేసు నమోదైందని, కోమాలో నుంచి ఆ బాబు బయటకు వస్తే వాళ్ల అమ్మ కనిపించదని అన్నారు.

'సినిమా హీరోది వ్యాపారం. డబ్బులు పెట్టాడు. వసూలు చేసుకున్నాడు.ఇందులో ఇచ్చిపుచ్చుకునేందుకు ఏముంది?' అని రేవంత్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్‌ అరెస్ట్‌లో మా ప్రమేయం లేదని, ఘటనలో మహిళ చనిపోయిందని, కొడుకు జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడని, ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులని సిఎం ప్రశ్నించారు. ఫిలింస్టార్‌, పొలిటికల్‌ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండదన్నారు. సైలెంట్‌గా సినిమా చూసి వెళ్తే ఎలాంటి సమస్య ఉండకపోయేదన్నారు. కారులోనుంచి బయటకు వచ్చి హడావుడి చేశారని, దాంతో జనం ఒక్కసారిగా ఎగబడడంతో కంట్రోల్‌ చేయలేకపోయారని పేర్కొన్నారు. అల్లు అర్జున్‌(Allu Arjun) మేనమామ చిరంజీవి(Chiranjeevi), పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ నేతలేనని, అల్లు అర్జున్‌ భార్య కుటుంబం తనకు బంధువులేనని.. హోంశాఖ తన దగ్గరే ఉందని, ఈ కేసు సంబంధించి రిపోర్ట్‌ తనకు తెలుసని రేవంత్ రెడ్డి చెప్పారు. 'సినిమా వాళ్లు పైసలు పెట్టారు. లాభాలు సాధించారు. వాళ్లు దేశం కోసం చేసిందేమీ లేదు ' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ehatv

ehatv

Next Story