ఎండపల్లి మండలం అంబరీ పెట్ గ్రామ శివారులో లారీని తప్పించబోయి పల్టీ కొట్టింది కారు. లక్ష్మణ్ కుమార్ , ఇద్దరు గన్ మెన్ లు,

తెలంగాణ ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రమాదానికి గురయ్యారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మణ్‌ కుమార్‌తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిచగా.. అడ్లూరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.

ఎండపల్లి మండలం అంబరీ పెట్ గ్రామ శివారులో లారీని తప్పించబోయి పల్టీ కొట్టింది కారు. లక్ష్మణ్ కుమార్ , ఇద్దరు గన్ మెన్ లు, డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాదులో ఓ వివాహానికి హాజరై తిరిగి ధర్మపురికి వెళ్తుండగా ఫిబ్రవరి 19 తెల్లవారుజామున 3 గంటలకు ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కారు అద్దాలు పగలకొట్టి కారులోంచి బాధితులను బయటకు తీశారు. వెంటనే పోలీస్ వెహికల్ లో కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు వెల్గటూర్ ఎస్సై ఉమా సాగర్. తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు.

Updated On 18 Feb 2024 10:20 PM GMT
Yagnik

Yagnik

Next Story