హైదరాబాద్(Hyderabad) శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయంలో(Chilukuri Balaji temple) బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సంతానం లేనివవారికి గరుడ ప్రసాదం(Garuda Prasadam) ఇవ్వనున్నట్టు ఆయన ప్రధానార్చకుడు రంగరాజన్ ఇటీవల ప్రకటించారు. అంతే... ఆలయంవైపు వెళ్లే మార్గం కిటకిటలాడింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
హైదరాబాద్(Hyderabad) శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయంలో(Chilukuri Balaji temple) బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సంతానం లేనివవారికి గరుడ ప్రసాదం(Garuda Prasadam) ఇవ్వనున్నట్టు ఆయన ప్రధానార్చకుడు రంగరాజన్ ఇటీవల ప్రకటించారు. అంతే... ఆలయంవైపు వెళ్లే మార్గం కిటకిటలాడింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాసబ్‌ట్యాం్ నుంచి మొదలు పెడితే మెహదీపట్నం, నానల్‌నగర్, లంగర్‌హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్‌ల మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్ స్తంభించింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు లో కూడా ట్రాఫిక్ జామ్(Traffic jam) అయ్యింది. దాదాపు లక్ష మంది వరకు వాహనాల్లో చిలుకూరుకు వెళ్లారట. దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. గరుడ ప్రసాద్ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే ఇదంతా జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున అయిదు గంటల నుంచే హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు చిలుకూరుకు ప్రయాణమయ్యారు. ఉదయం పదిన్నర గంటల వరకు 60 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చారట! ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ట్రాఫిక్ సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణికులు రావొద్దని పోలీసులు కోరుతున్నారు.