మాయమాటలు, కల్లబొల్లి కబుర్లు చెప్పి పోలీసులనే(Police) బురిడీ కొట్టించిన ఘటన హైదరాబాద్‌లో(Hyderabad) చోటు చేసుకుంది. ఓ ఫేక్ ఎన్‌ఆర్‌ఐ(NRI) డిసిల్వా(DeSilva) తాను బెల్జియం(Belgium) నుంచి వచ్చానని.. తనను ఆటో డ్రైవర్లు మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆకలేస్తుందని పోలీసుల దగ్గర డబ్బులు ఇప్పించుకొని పారిపోయాడు. ఈ విధంగా మూడు పోలీస్‌ స్టేషన్లలో డబ్బులు తీసుకొని ఉడాయించడంతో పోలీసులే అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. డిసిల్వా అనే వ్యక్తి చేతిలో పోలీసులే మోసపోయారు. సాధారణంగా కొందరు మోసగాళ్ల చేతిలో తాము మోసపోయామని పోలీసులకు ఫిర్యాదులు వస్తుంటాయి. ఇతను కూడా అలానే మోసపోయాడని అనుకొని పోలీసులు అతనిపై ఔదార్యం చూపించారు. నిందితుడు మూడు పోలీస్‌స్టేషన్లలో పోలీసులను(Police station) ఇలానే బురిడీ కొట్టించాడు. తెలంగాణ సీఎం రేవంత్‌ను(CM Revanth Reddy) చూసేందుకు బెల్జియం నుంచి వచ్చానని.. తనను ఆటో డ్రైవర్‌(Auto Driver) మోసం చేసి ల్యాప్‌టాప్, డబ్బులు లాక్కున్నారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను మోసపోయానని అమాయకంగా నటించాడు. ఈ కేటుగాడి నటనకు పోలీసులు కూడా ఫిదా అయ్యారు. పాపం.. అమాయకుడని ఇతగాడిపై జాలి పడ్డారు. తన దగ్గర డబ్బులు లేవని.. ఆకలి వేస్తుందని చెప్పడంతో 500 రూపాయలను పోలీసులు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకొని కంటికి కనిపించకుండా వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత మధురానగర్‌ పీఎస్‌కు వెళ్లిన డిసిల్వా.. తాను మోసపోయానని మాయమాటలు చెప్పాడు. అక్కడి పోలీసుల నుంచి వెయ్యి రూపాయలు తీసుకొని ఉడాయించాడు. గతంలో ఒకసారి భువనగిరి పోలీసులను కూడా ఇలాగే మోసం చేసి వెయ్యి రూపాయలు తీసుకొని పారిపోయాడు. దీంతో మధురానగర్‌ పోలీసులకు అనుమానం కలిగింది. డిసిల్వాపై విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితుడు డిసిల్వా గత కొంత కాలంగా పోలీసులను ఇదే తరహాలో మోసం చేస్తున్నాడని విచారణలో తేలింది. నిందితుడి వ్యవహారం బయటపడడంతో పోలీసులు విస్తుపోయారు. ఇలాంటి కేటుగాడి చేతిలో ఎలా మోసపోయామని ఒకింత ఆగ్రహం చెందుతున్నారు. మధురానగర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసి.. కేటుగాడి కోసం గాలిస్తున్నారు.

Updated On 13 Dec 2023 2:09 AM GMT
Ehatv

Ehatv

Next Story