తెలంగాణ అసెంబ్లీలో(TS assembly) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti vikramarka) బడ్జెట్(Budget) ప్రవేశపెట్టారు.
తెలంగాణ అసెంబ్లీలో(TS assembly) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti vikramarka) బడ్జెట్(Budget) ప్రవేశపెట్టారు. ఈ సభలకు తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్(KCR) హాజరయ్యారు. మరోవైపు ఇదే సమయంలో శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు(Sreedhar babu) బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. ఇందులో మూలధన వ్యయం రూ.33,487 కోట్లు ఉండగా.. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26.216.28 కోట్లు, కేంద్ర గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు రూ.5 లక్షల సాయం.. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6 లక్షల సాయం.. ప్రతీ నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రం మొత్తం 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు.
కేటాయింపులు ఇలా
ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లు
ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు
సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు
సంక్షేమానికి రూ.40 వేల కోట్లు
హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు కేటాయింపు
రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు
హోంశాఖకు రూ.9,564 కోట్లు కేటాయింపు
పశుసంవర్ధక శాఖకు రూ. 1,980 కోట్లు
విద్యాశాఖకు రూ. 21,292 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు
ప్రజాపంపిణీకి రూ.3,836 కోట్లు
గృహజ్యోతికి రూ.2,418 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
500 రూపాయల గ్యాస్ సిలిండర్‌కు రూ.723 కోట్లు
అడవులు పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు
మైనార్టీ శాఖకు రూ.3,003 కోట్లు
స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.2,736 కోట్లు
రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1525 కోట్లు
గృహజ్యోతికి రూ.2,418 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు
GHMC పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ రూ.3385 కోట్లు
హైడ్రాకి 200 కోట్లు
ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు కొరకు రూ.200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు
పాత నగరంలో మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైలు సిస్టంకు రూ.50 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు
హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు