తెలంగాణ అసెంబ్లీ(Telangana Assemblly)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)విద్యుత్ రంగ శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో ఆర్ధిక అరాచకం సృష్టించారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్ శాఖ మొత్తం అప్పు 81,516 కోట్లుగా వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assemblly)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)విద్యుత్ రంగ శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో ఆర్ధిక అరాచకం సృష్టించారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్ శాఖ మొత్తం అప్పు 81,516 కోట్లుగా వెల్లడించారు. విద్యుత్ శాఖకు ప్రభుత్వ శాఖల నుండి 28 వేల కోట్ల రూపాయల బిల్లుల రావాలని వివరించారు. 2014 నాటికి విద్యుత్ శాఖకు ప్రభుత్వ శాఖల బకాయిలు కేవలం 1,595.37 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. 28 వేల కోట్ల బకాయిల్లో సాగునీటి శాఖ 14,193 కోట్లు చెల్లించాలని వివరించారు. మిషన్ భగీరథ విద్యుత్ బకాయిలు 3,558 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
డిస్కంలు అప్పుల్లో కూరుకు పోయాయని అన్నారు. డిస్కంలకు 35,227 వేల కోట్ల అప్పులు పెరిగాయని తెలిపారు. 2014 నాటికి జెన్‌కోలో అప్పు 7,662 కోట్ల రూపాయలు ఉండగా.. 10 ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో 32,797 కోట్ల అప్పులు పెరిగాయని వివరించారు. వ్యవసాయంకి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.
విద్యుత్ రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు సలహాలు ఇవ్వండని అడిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఏ రోజు ఇవ్వలేదన్నారు. జగదీష్ రెడ్డి గొంతు తెరుచుకుని అరిస్తే అబద్ధాలు నిజం కావు.. 24 గంటల కరెంటు మీ ప్రభుత్వం ఏ రోజు ఇవ్వలేదన్నారు. సభను తప్పుదోవ పట్టించే విధంగా జగదీష్ రెడ్డి పదే పదే 24 గంటల కరెంటు ఇచ్చామని చెప్పడం సరికాదన్నారు.
24 గంటల కరెంటు మీ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్తున్నాం. దీన్ని ఒప్పుకోకుండా బీఆర్ఎస్ సభ్యులు సభలో గోల చేయడానికి ముందుకు దూసుకు వస్తే.. ఇక్కడ ఎవరు భయపడరు. మీ ప్రవర్తన సభకు శోభ ఇవ్వదు. గౌరవం ఇవ్వదని భట్టి విక్రమార్క సభ్యులను వారించే ప్రయత్నం చేశారు.