ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్(BRS) స్వేద పత్రంపై ఘాటుగా స్పందించారు. బావ, బావమరిది కష్టపడి, చెమట చిందించి సంపాదించినట్లు చెప్తున్నారు.
ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్(BRS) స్వేద పత్రంపై ఘాటుగా స్పందించారు. బావ, బావమరిది (హరీష్ రావు, కేటీఆర్) కష్టపడి, చెమట చిందించి సంపాదించినట్లు చెప్తున్నారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించాలంటే తెలంగాణ ప్రజలు స్వేదం(Sweat) చిందించాలన్నారు. బీఆర్‌ఎస్ నేతలు తిన్నవన్నీ కక్కిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక వీరి కుంభకోణాలను వెలికి తీస్తామని రాహుల్ చెప్పారు.. త్వరలోనే బీఆర్‌ఎస్ నేతల అక్రమాలపై జ్యుడీషియల్ విచారణ ప్రారంభమవుతుందన్నారు. సీఎం రేవంత్‌తో పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన డీసీఎం భట్టి.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై కేంద్ర పెద్దలతో కలిసి విన్నవించే అవకాశం ఉంది. ప్రధాని మోడీని కలిసిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలను వీరు కలిసే అవకాశం ఉందని సమాచారం.