పేదవాళ్లను అడ్డంపెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్(Bhatti vikramarka) అన్నారు.
పేదవాళ్లను అడ్డంపెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్(Bhatti vikramarka) అన్నారు.
సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్(Meet and greet) కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ధన, ప్రాణ, ఆస్తులు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, అందులో భాగంగా చెరువులను రక్షించి, భవిష్యత్తు తరాలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపటినట్లు చెప్పారు. మూసీ నదిలో మంచినీరు పారించడం, పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని చెబుతూ ఇళ్ల నిర్మాణం పేరిట రాళ్లు కనుమరుగైపోయాయని, లేక్స్ కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్నారని, పార్కులు లేకుండా పోయాయని చెప్పుకొచ్చారు. లేక్స్ లేకపోతే ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాద్‌లోనూ ఏర్పడతాయన్నారు.