సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వం ప్రధానమైన ఎజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. ఖమ్మం(Khammam) కాంగ్రెస్ పార్టీ(congress Party) జిల్లా కార్యాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswar Rao), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో(Ponguleti Srinivas Reddy) క‌లిసి ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని స్ప‌ష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశాం. వంద రోజుల్లో మిగతా నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామ‌ని తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ, ప్రతి సంస్థ ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ పీపుల్స్ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు అంకితం అని వెల్ల‌డించారు. అసెంబ్లీలో పండుగ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టామ‌న్నారు. మహిళా సాధికారతకు తొలి అడుగుగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉచిత ఆర్టీసీ బస్సులను ప్రారంభించామ‌ని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతూ అందించే గ్యారెంటీని ప్రారంభించామ‌ని వివ‌రించారు.

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలకు వారంటీ లేదని ఎద్దేవా చేసిన బీఆర్ఎస్(BRS) నాయకులకు చెంపపెట్టు లాగా బాధ్యత తీసుకున్న రెండు రోజుల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ(Arogya shree), ఉచిత బస్సు హామీలను అమలు చేశామ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇండ్ల సమస్య, పోడు ల్యాండ్స్, ఇతర సమస్యలను పరిష్కరిస్తామ‌ని తెలిపారు.

జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇంటి స్థలాలు ఇచ్చాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమ‌ర్శించారు. జర్నలిస్టుల ఇండ్ల సమస్య పరిష్కారానికి కోర్టు అనుమతులు ఇచ్చినప్పటికీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టిందన్నారు. ఖమ్మంలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను తొమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి అమూల్యమైన ఓట్లు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు అంటూ ముగించారు.

Updated On 10 Dec 2023 5:23 AM GMT
Ehatv

Ehatv

Next Story