తెలంగాణ(Telangana) ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు(Govt School) ఉచిత విద్యుత్‌(free Current) ఇవ్వాలని నిర్ణయించింది.

తెలంగాణ(Telangana) ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు(Govt School) ఉచిత విద్యుత్‌(free Current) ఇవ్వాలని నిర్ణయించింది. ఉపాధ్యాయుల దినోత్సవం కానుకగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti vikramarka) ఈ ప్రకటన చేశారు. ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ వెంటనే అమలు చేయనున్నట్టు తెలిపారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రభుత్వం ఇస్తామన్న ఉచిత విద్యుత్తు కొన్ని పాఠశాలలకేనా? అన్నింటికి కాదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 27,862 విద్యాసంస్థలకు ఈ సదుపాయం కల్పిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలను కలుపుకుంటే 30 వేలకు పైగా ఉన్నాయి. వీటికి హాస్టళ్లు అదనం. దీన్నిబట్టి అన్నింటికీ ఈ సదుపాయం వర్తించదేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story