తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన కోరుట్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి(Deepthi) అనుమానాస్పద మృతి కేసు కొలిక్కి వచ్చింది. దీప్తిని ఆమె చెల్లెలు చందననే(Chandhana) హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. ప్రాథమిక విచారణలో(Primary Investigation) చందన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. చందన ప్రేమ వ్యవహారం దీప్తి హత్యకు కారణమని తేలింది.
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన కోరుట్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి(Deepthi) అనుమానాస్పద మృతి కేసు కొలిక్కి వచ్చింది. దీప్తిని ఆమె చెల్లెలు చందననే(Chandhana) హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. ప్రాథమిక విచారణలో(Primary Investigation) చందన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. చందన ప్రేమ వ్యవహారం దీప్తి హత్యకు కారణమని తేలింది. దీప్తిని హత్య చేయడంలో చందనకు ఆమె ప్రియుడు కూడా ఉన్నాడు. తన ప్రియుడితో వెళ్లిపోయే క్రమంలో దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్(Plaster) వేసి, చున్నీ చుట్టి వెళ్లిపోయినట్టు చందన ఒప్పుకున్నదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
దీప్తి కేసులో చెల్లెలు చందన, ఆమె ప్రియుడు, ప్రియుడి తల్లి, అతడి తరపు మరో బంధువు, కారు డ్రైవర్ ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది.
జగిత్యాల(Jagityala) జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బకు చెందిన 24 ఏళ్ల బంక దీప్తి ఆగస్టు 29న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అదే రాత్రి ఆమె చెల్లెలు చందన అదృశ్యమైంది. ఓ యువకుడితో కలిసి బస్టాండ్ నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్నట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది.
ఇంట్లో మద్యం బాటిళ్లు దొరకడం, సీసీటీవీ ఫుటేజీలో ఉన్నది చందన కాదని తేలడం, అక్కను తాను చంపలేదంటూ చందన తన సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపడం.. ఇవన్నీ పోలీసులను కాసింత గందరగోళానికి గురి చేశాయి. పోలీసులు మాత్రం దీప్తి కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీప్తి తండ్రి శ్రీనివాసరెడ్డ తన చిన్న కూతురు చందనతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. మూడు నాలుగు బృందాలుగా విడిపోయి చందన కోసం వెతకసాగారు. ఈ క్రమంలో చందన ఒంగోలువైపు వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
టంగుటూరులోని టోల్‌గేట్‌ను తప్పించుకుని అలకూరపాడువైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు అణువణువు గాలించారు. చివరకు ఒంగోలులోని ఓ లాడ్జిలో చందన, ఆమె స్నేహితుడిని పట్టుకున్నారు. జగిత్యాల పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చేసింది చందన. కాలేజీలో చదువుతున్నప్పుడే సీనియర్ ప్రేమలో పడింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో చందన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీప్తి కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఊరుకు వెళ్లిన సమయంలో దీప్తితో చందన గొడవ పడింది. ఆపై ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసింది. ఊపిరి ఆడక దీప్తి మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.