అయిదేళ్ల పాటు డిబార్‌ అయిన కమలాపూర్ మండల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థి హరీశ్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. పేపర్‌ లీక్‌ వ్యవహారంలో పదో తరగతి విద్యార్థి హరీశ్‌పై ఐదేళ్ల డిబార్‌ విధించారు. తానేమీ తప్పు చేయలేదని, ఎవరో గుర్తు తెలియని

అయిదేళ్ల పాటు డిబార్‌ అయిన కమలాపూర్ మండల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థి హరీశ్‌కు(Harish) హైకోర్టు(High Court) ఊరటనిచ్చింది. పేపర్‌ లీక్‌ వ్యవహారంలో పదో తరగతి విద్యార్థి హరీశ్‌పై ఐదేళ్ల డిబార్‌ విధించారు. తానేమీ తప్పు చేయలేదని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పరీక్ష హాల్‌ కిటికీ దగ్గరకు వచ్చి తన నుంచి బలవంతంగా క్వొశ్చన్‌ పేపర్‌ తీసుకున్నాడని హరీశ్‌ చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. పేపర్‌ ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించడంతోనే ఇచ్చానని హరీశ్‌ నెత్తినోరు కొట్టుకుని చెప్పినా అధికారులు కరగలేదు. హరీశ్‌ తల్లిదండ్రులు కూడా తన కొడుకు జీవితాన్ని నాశనం చేయవద్దని కన్నీటితో వేడుకున్నారు. అధికారులు మాత్రం చలించలేదు. ఇదిలా ఉంటే ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్‌ హైకోర్టులో వారి తరఫున రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. హైకోర్టు ఈ అంశంపై కీలక నిర్ణయం ప్రకటించింది. హరీశ్‌కు మిగతా పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టు అధికారులను ఆదేశించింది. సోమవారం నుంచి హరీశ్‌ పరీక్షలకు హాజరుకావొచ్చని న్యాయస్థానం తెలిపింది. అయిదేళ్లు డిబార్‌ చేయడం వల్ల తన కొడుకు భవిష్యత్తుకు తీరని అన్యాయం జరుగుతుందని హరీష్‌ తండ్రి చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. హిందీ, ఇంగ్లీష్ పేపర్లు ఇన్‌స్టంట్‌కు అనుమతి ఇవ్వాల్సిందేనని తెలిపింది.

Updated On 8 April 2023 5:43 AM GMT
Ehatv

Ehatv

Next Story