దేశమంతటా శరన్నవరాత్రుల వేడుకలు(Navrathri Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలం(Srisailam) క్షేత్రంలో దసరా ఉత్సవాలు(Dasara Festival) వైభవోపేతంగా సాగుతున్నాయి. మహోత్సవాలలో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష కుంకుమార్చనలు నవవర్చనలు పారాయణాలు కుమారి పూజలు జరిగాయి.

Srisailam Navrathri Celebrations
దేశమంతటా శరన్నవరాత్రుల వేడుకలు(Navrathri Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలం(Srisailam) క్షేత్రంలో దసరా ఉత్సవాలు(Dasara Festival) వైభవోపేతంగా సాగుతున్నాయి. మహోత్సవాలలో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష కుంకుమార్చనలు నవవర్చనలు పారాయణాలు కుమారి పూజలు జరిగాయి. అలాగే నవదుర్గ అలంకారంలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని స్కంద మాత రూపంలో అలంకరించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాసవాహనసేవలో భాగంగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో వాహనంపై అధిరోహింపజేసి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలతో చేసిన అలంకరణలు, దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి.
