మోసాలు, నేరాలు చేసేందుకు సైబర్(Cyber) ముఠాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల స్మార్ట్ ఫోన్లను బేస్ చేసుకొని న్యూడ్ కాల్స్‌తో(Nude calls) న్యూసెన్స్ సృష్టిస్తున్నారు. అవతల తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేశారంటే ఇక అంతే సంగతులు. ఇటీవల న్యూడ్ కాల్స్ బాధితులు పెరిగిపోతున్నారు. న్యూడ్ కాల్స్ బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం..
మోసాలు, నేరాలు చేసేందుకు సైబర్(Cyber) ముఠాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల స్మార్ట్ ఫోన్లను బేస్ చేసుకొని న్యూడ్ కాల్స్‌తో(Nude calls) న్యూసెన్స్ సృష్టిస్తున్నారు. అవతల తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేశారంటే ఇక అంతే సంగతులు. ఇటీవల న్యూడ్ కాల్స్ బాధితులు పెరిగిపోతున్నారు. న్యూడ్ కాల్స్ బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం.. అవతలి నుంచి వాట్సాప్ వీడియోకాల్(Video call) చేసిన అమ్మాయి పూర్తి న్యూడ్‌గా ఉండి.. హిందీ, ఇంగ్లీష్‌లో(English) హస్కీ వాయిస్‌తో మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. అలానే ట్రాప్‌లోకి దించేసి ఇవతల మాట్లాడుతున్న వ్యక్తి వీడియోను రికార్డు చేస్తుంది. ఆ తర్వాత ముఠా సభ్యులు రంగంలోకి దిగి..డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ కు(Blackmail) దిగుతారు. లేదంటే.. న్యూడ్‌గా ఉన్న అమ్మాయితో మాట్లాడిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేస్తామని బెదిరిస్తారు. నిజాబాబాద్(Nizamabad) జిల్లాలో ఇలాంటి న్యూడ్ కాల్స్ చేసి చీటింగ్ చేసిన తతంగాలు ఒక్కొక్కటిగా బయట పడతున్నాయి.
ఇటీవల నిజామాబాద్, డిచ్పల్లికి చెందిన పలువురు నేతలు, ఆర్మూర్‌కు(Armoor) చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు న్యూడ్ కాల్స్ ముఠా ఉచ్చులో చిక్కుకునట్లు తెలుస్తోంది. ఇప్పటికే న్యూడ్ కాల్స్ చేసే ముఠా ఆపరేషన్‌కు చిక్కిన చాలా మంది.. వారికి లక్షల్లో డబ్బులు ముట్ట చెప్పారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యాపారికి(Businessmen) అర్ధరాత్రి తనకు న్యూడ్ కాల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడిందట. న్యూడ్ కాల్స్ చేసి మోసం చేస్తున్న ముఠాల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు(Police) హెచ్చరిస్తున్నారు. అలాగే ఆన్లైన్లో వచ్చే అనవసరమైన లింక్ లు ఓపెన్ చేయవద్దని.. రాత్రిపూట నెట్ ఆఫ్ చేసుకుంటే చాలా మంచిదని సూచిస్తున్నారు.