ఓ వ్యక్తి సైబర్‌ క్రైంలో(Cyber crime) దిట్ట.

ఓ వ్యక్తి సైబర్‌ క్రైంలో(Cyber crime) దిట్ట. సైబర్‌ మోసం చేసి సంపాదించిన డబ్బును మహిళ ఖాతాలోకి పంపించి ఆమె ఇల్లుని కబ్జా చేశాడు. బాధితురాలి బ్యాంక్‌ ఖాతా ఫ్రీజ్‌ కావడంతో ఈ వ్యవహారమంతా బయటపడింది. నిందితుడిపై జూబ్లీహిల్స్‌(Jubliee hills) పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో(America) ఉంటున్న డాక్టర్ బినోతి మార్తాండ్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.52 నందగిరి హిల్స్‌ లే ఔట్‌లో నెంబర్ 81లో 334 గజాల్లో ఇల్లు ఉంది. అయితే ఆ ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఆన్‌లైన్‌లోనే ఇల్లు అమ్మకానికి పెట్టి ప్రకటన ఇచ్చారు. అంతేకాకుండా గురునాథ్‌ అనే ఏజెంట్‌ను పెట్టుకున్నారు. ఆ సమయంలోనే ఎస్‌బీకే గ్రూప్‌ చైర్మన్‌ బాబు అలియాస్ షేక్‌ పేరుతో వాట్సాప్‌లో కాల్ చేశారు. మీ ఇంటిని కొనేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపాడు. దీంతో 12.50 కోట్లకు ఇల్లును అమ్ముతున్నట్లు చెప్పింది. ఈ మొత్తాన్ని పలు దఫాల్లో ఆమె ఖాతాకు మళ్లించాడు. ఈ ఏడాది జులై 18న చివరి విడత డబ్బు పంపించినట్లు ఆమె ఖాతాలో వేసినట్లు చెప్తూ ఇంటిని అదే రోజు స్వాధీనం చేసుకుంటున్నానని చెప్పారు. ఆ తర్వాత రోజునే ఆమె ఖాతా ఫ్రీజ్‌ చేస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ ఆమెకు నోటీసు పంపించారు. దీంతో షాక్‌ తిన్న బాధితురాలు షేక్ బషీర్‌కు ఫోన్‌ చేస్తే స్పందించలేదు. బ్యాంక్‌ అధికారులను ఆరా తీయడంతో ఆ డబ్బు సైబర్‌ క్రైం చేసి సంపాదించాడని, ఆ డబ్బునే మీ ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిపారు. దీంతో జులై 28న స్వదేశానికి తిరిగివచ్చిన బాధితురాలు, ఆమె కొడుకు ఇంటికి వెళ్లగా బషీర్‌ అనుచరులు అందులో ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బషీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story