అమ్మాయిలు.. సోషల్‌ మీడియాతో (Social media)కాసింత జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండకపోతే జిష్ణుకీర్తన్‌ రెడ్డి(Jishnukirtan Reddy) వంటి వాళ్ల బారిన పడాల్సి వస్తుంది. మేడ్చల్‌కు(Medchal) చెందిన ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తాడంటే ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) అమ్మాయి పేరుతో ఫేక్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేస్తాడు. ఆ తర్వాత అమ్మాయిలు, యువతులతో పరిచయాలు పెంచుకుంటాడు. అటు పిమ్మట నగ్న ఫోటోలు(Nude Pics) పంపించాలంటూ వేధిస్తుంటాడు. వీడు బాలికలను కూడా వదల్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటాడు.

అమ్మాయిలు.. సోషల్‌ మీడియాతో (Social media)కాసింత జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండకపోతే జిష్ణుకీర్తన్‌ రెడ్డి(Jishnukirtan Reddy) వంటి వాళ్ల బారిన పడాల్సి వస్తుంది. మేడ్చల్‌కు(Medchal) చెందిన ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తాడంటే ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) అమ్మాయి పేరుతో ఫేక్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేస్తాడు. ఆ తర్వాత అమ్మాయిలు, యువతులతో పరిచయాలు పెంచుకుంటాడు. అటు పిమ్మట నగ్న ఫోటోలు(Pics) పంపించాలంటూ వేధిస్తుంటాడు. వీడు బాలికలను కూడా వదల్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటాడు. ఆ సైబర్‌ నేరగాడిని(Cyber Crime) సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌(CCS Cyber Crime) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చెబుతున్నదాని ప్రకారం .. ఎస్‌.జిష్ణుకీర్తన్‌ రెడ్డి బీటెక్‌ చదువుతున్నాడు. అమ్మాయిల పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ క్రియేట్‌ చేశాడు. ఆ అకౌంట్‌ డీపీలో అమ్మాయి ఫోటో పెట్టాడు. దాంతో అతడిని అమ్మాయిగానే భావించి ఫ్రెండ్‌షిప్‌ చేశారు చాలామంది. అలా ఫ్రెండ్స్‌ అయిన అమ్మాయిలతో చాటింగ్‌ చేస్తూ, వారి ఫోటోలు సేకరించేవాడు. వాటిని మార్ఫింగ్‌ చేసి వారికే పంపించేవాడు. వాటిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయకుండా ఉండాలంటే ప్రతి రోజు తనకు నగ్నఫోటోలు, వీడియోలు పంపించాలని బెదిరించేవాడు. లేదంటే సోషల్‌ మీడియాలో పరువు తీస్తాననేవాడు. ఇటీవల ఓ బాలికను అలాగే ట్రాప్ చేశాడు. ఆమెకు మార్ఫింగ్‌ ఫోటోలు పంపించి బెదిరించాడు. ప్రతిరోజూ నగ్నఫొటోలు పంపించకపోతే తన వద్ద ఉన్న ఫొటోలను వైరల్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ పద్మ నేతృత్వంలోని బృందం దర్యాప్తు జరిపింది. నిందితుడు జిష్ణు కీర్తన్‌రెడ్డిగా గుర్తించి బుధవారం అరెస్ట్ చేసింది. నిందితుడి ఫోన్‌ను సైబర్‌క్రైమ్‌ పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఫేక్‌ ఐడీతో అతడు అనేక మందితో చాటింగ్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎంతమంది బాధితులు ఉన్నారు? వారు ఎక్కడ ఉంటారనే విషయంపైదర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated On 4 Jan 2024 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story