తెలంగాణ(Telangana)లో మరో అయిదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి, ద్రోణి ప్రభావంతో ఏర్పడిన క్యూములోనింబస్ కారణంగా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మోస్తారు వర్షాలు, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
వర్షాకాలంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటం సహజం.
తెలంగాణ(Telangana)లో మరో అయిదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి, ద్రోణి ప్రభావంతో ఏర్పడిన క్యూములోనింబస్(Cumulonimbus) కారణంగా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మోస్తారు వర్షాలు, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
వర్షాకాలంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటం సహజం. కానీ ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభం నుంచే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనది దక్కన్ పీఠభూమి ప్రాంతం కావడం, గత మూడు దశాబ్దాలలో పర్యావరణం దెబ్బతినడం కారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం , ఫలితంగా ఆవర్తన ద్రోణులు ఏర్పడటం, మరఠ్వాడ ప్రాంతం మనకు దగ్గరలో ఉండటం వల్ల క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అధిక వర్షపాతం నమోదవుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. మార్చి ఒకట నుంచి ఏప్రిల్ 26 వరకు అన్ని జిల్లాలలో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదయ్యిందని తెలిపారు. ఇదిలా ఉంటే సోమ, మంగళవారాలలో కురిసిన అకాల వర్షాలు రైతులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. పంటలు మొత్తం దెబ్బతిన్నాయి.