ఐపీఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్(IAS Smita Sabarwal) చేసిన వ్యాఖ్యలపై రెండు సార్లు సివిల్స్ ర్యాంక‌ర్‌, దివ్యాంగురాలు, సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ(CSB IAS acadamy) చీఫ్‌ బాలలత(Balaltha) ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐపీఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్(IAS Smita Sabarwal) చేసిన వ్యాఖ్యలపై రెండు సార్లు సివిల్స్ ర్యాంక‌ర్‌, దివ్యాంగురాలు, సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ(CSB IAS acadamy) చీఫ్‌ బాలలత(Balaltha) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో (Press club)మాట్లాడుతూ.. తనతో సివిల్స్ పరీక్ష రాయడానికి(UPSC) సిద్ధమా..? అంటూ స్మిత సబర్వాల్‌కు సవాల్ విసిరారు. తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నారు. స్మిత సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోందని.. ఆమె మాటలు దురదృష్టకరం అన్నారు.

అసలు దివ్యాంగులం బ్రతకాలా వద్దా.? మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా? వద్దా? అని స్మిత‌ను ప్ర‌శ్నించారు. పని ఉన్నోళ్ళు పని చేస్తారు. ట్వీట్‌లు పెడుతూ ఉండరన్నారు. స్మిత సబర్వాల్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారేమో కానీ.. మెంటల్ గా ఫిట్ గా లేర‌న్నారు. అసలు స్మిత సబర్వాల్ అర్హత ఎంటి? అని ప్ర‌శ్నించారు. స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా.? తెలంగాణ ప్రభుత్వ విధానమా.? చెప్పాల‌న్నారు. స్మిత తన సర్వీసులో ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్ లో పరుగెత్తుతూ పని చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్మిత ట్వీట్ దివ్యంగుల పట్ల వివక్షతను చూపుతోందన్నారు. ఐటీ యాక్ట్ కింద స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి రెండు కాళ్ళు పనిచేయవు. కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. జైపాల్ రెడ్డికి కాళ్ళు లేకపోయినా ఐఏఎస్ అధికారులే అయన్ని నడిపించారు. ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే ప్రీమియర్ పోస్టులు అని స్మిత కి ఎవరు చెప్పారు? అని ప్ర‌శ్నించారు.

సీఎం, సీఎస్ ఆలోచించి స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని బాలలత డిమాండ్ చేశారు. స్మిత లాంటి ఆఫీసర్ కు కీలక పోస్టు ఇస్తే ఏమవుతుందో అర్థం అవుతుందన్నారు. స్మిత చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించాలని కోరారు. స్మితపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రజాస్వామ్యంలో హక్కు అని సీఎం అన్నారు. కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామ‌న్నారు. స్మిత చేసిన వ్యాఖ్యలపై సాటి ఐఏఎస్ లు స్పందించాలన్నారు. స్మిత సబర్వాల్ కి ఏదైనా జరగరానిది జరిగి దివ్యంగురాలు అయితే ఐఏఎస్‌కు రాజీనామా చేస్తారా? అని ప్ర‌శ్నించారు.

స్మిత జస్ట్ ఒక ఐఏఎస్ అధికారి మాత్రమేన‌న్నారు. స్మిత పర్సనల్ లైఫ్, స్మిత రీల్స్ గురించి నేను మాట్లాడను.. ఆమె మా కమ్యూనిటిపై మాట్లాడినందుకు రీయాక్ట్ అయ్యాను.. స్మిత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోందన్నారు.

Eha Tv

Eha Tv

Next Story