రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) కడ్తాల్(Kadthal)లో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ గ్రూప్(whatsapp Group) నుంచి తనను రిమూవ్ చేశారని , అతని స్నేహితుడు ఇద్దరి ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. కడ్తాల దగ్గరలో ఉన్న బటర్ ఫ్లై సిటీ వెంచర్‌లోని ఓ విల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఈ హత్యల విషయం వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) కడ్తాల్(Kadthal)లో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ గ్రూప్(whatsapp Group) నుంచి తనను రిమూవ్ చేశారని , అతని స్నేహితుడు ఇద్దరి ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. కడ్తాల దగ్గరలో ఉన్న బటర్ ఫ్లై సిటీ వెంచర్‌లోని ఓ విల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఈ హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోవిందాయిపల్లికి చెందిన బీజేపీనేత జల్కం రవి(BJP Leader Balkam Ravi) బటర్ ఫ్లై వెంచర్(Butterfly Venture)లోని ఓ విల్లాను అద్దెకు తీసుకొని రియల్ ఎస్టేట్(Real Estate) కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ నెల 4న తన పుట్టిన రోజు ఉన్నందున బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్నేహితులతో కలిసి రవి వేడుకలు జరుపుకున్నాడు. అయితే ఈ ఫొటోలను రవి తన గ్రామానికే చెందిన వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. వ్యక్తిగత ఫొటోలను గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకు పోస్టు చేయడమని పలువురు యువకులు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలోనే ఇదే గ్రామానికి చెందిన గుండెమోని శివగౌడ్(25), శేషుగారి శివగౌడ్(27)లు రవిని వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు.
దీంతో ఆగ్రహం చెందిన రవి శివగౌడ్, శేషుగారి శివగౌడ్‌ను తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అప్పటికే రవితో పాటు మరో బీజేవైఎం నాయకుడు పల్లె రాజుగౌడ్ ఉన్నారు. నలుగురు కలిసి మద్యం తాగారు. వాట్సాప్ గ్రూప్ నుంచి తనను ఎందుకు తొలగించారని, తన ఫొటోలు ఎందుకు డిలీట్ చేశారని రవి వీరిద్దరినీ ప్రశ్నించాడు. ఇదే విషయంపై రెండు గ్రూపుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణ పెద్దది కావడంతో రవి, పల్లె రాజుగౌడ్ కత్తులతో గుండెమోని శివగౌడ్, శేషుగారి శివగౌడ్‌పై దాడులు చేశారు. తీవ్ర గాయాలతో ఇద్దరూ మృతి చెందారు. ఆ తర్వాత విల్లాకు తాళం వేసి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విల్లా తాళం పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. గుండోమోని శివగౌడ్ హైదరాబాద్‌లోని ఓ చికెన్ సెంటర్‌లో పనిచేస్తుంటాడు. శేషుగారి శివగౌడ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ శ్రీశైలం రోడ్డుపై గ్రామస్తులు ఆందోళన చేశారు. దాదాపు రెండు గంటలకుపైగా అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. వీరి హత్యకు వాట్సాప్ వివాదమే కారణమా మరేదైనా ఉండి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.