మోసం కాంగ్రెస్ నైజం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు.

మోసం కాంగ్రెస్(Congress) నైజం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమ‌ర్శించారు. నయవంచనకు నిలువెత్తు రూపం.. కాంగ్రెస్.. అందుకే ఆదిలోనే ఇండియా కూటమి(INDIA alliance)కి బీటలు వ‌చ్చాయ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ ను వీడి టీఎంసీ(TMC), ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party)లు ఒంటరి పోరు చేయాల‌నుకుంటున్నాయ‌ని.. మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్.. దేశ ప్రజలను ఏం మెప్పిస్తుందని ప్ర‌శ్నించారు.

మోదీ(Modi)ని, బీజేపీ(BJP)ని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదు.. ఇండియా కూటమికి అంతకన్నా లేదు.. మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు నిదర్శనం అన్నారు. అందుకూ దేశ ప్రజల చూపు ప్రాంతీయ శక్తులవైపే అన్నారు. తెలంగాణలో కెసిఆర్(KCR( అయినా.. బెంగాల్ లో మమతా(Mamata Banerjee) దీదీ అయినా.. పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్(Aravind Kejriwal) అయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేది.. రాష్ట్రాల్లో బలమైన పార్టీలేన‌న్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం అన్నారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రాంతీయ శక్తుల పాత్రే కీలకమ‌న్నారు.

Updated On 25 Jan 2024 9:30 PM GMT
Yagnik

Yagnik

Next Story