హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌-కన్వెన్షన్‌ కూల్చివేతపై సీపీఐ నారాయణ రియాక్టయ్యారు.

హీరో అక్కినేని నాగార్జునకు(Akkineni nagarjuna) చెందిన ఎన్‌-కన్వెన్షన్‌(N Convention) కూల్చివేతపై సీపీఐ నారాయణ(CPI Narayana) రియాక్టయ్యారు. హైడ్రా ఏర్పాటు మంచి పరిణామమన్నారు. గత ప్రభుత్వం చేయనిది రేవంత్‌(Revanth reddy) చేస్తున్నారని కితాబిచ్చారు. పనిలో పనిగా పల్లా, మల్లారెడ్డి(Malla reddy) అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేయాలని అన్నారు. నాగార్జున బిగ్‌బాస్‌కే బిగ్‌బాస్‌లా(Bigg boss) మారారని వ్యాఖ్యానించారు. దొంగ పట్టాలు సృష్టించి చెరువు కబ్జా చేశారన్నారు. నాగార్జున సినిమా డైలాగులు కొడితే సరిపోదని చెబుతూ అతడి నుంచి పదేళ్ల అద్దె వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు సీపీఐ నారాయణ. చిత్రమేమిటంటే ఇదే నారాయణ కరకట్ట మీద అక్రమంగా కట్టిన ప్రజా వేదికను జగన్‌ ప్రభుత్వం కూలగొడితే పెద్ద హంగామా చేశారు. జగన్‌ను విధ్వంసకారుడన్నారు. ప్రజావేదికను ఊడదీసే అవకాశం ఉన్నా కూల్చివేశారని అప్పట్లో అన్నారు. అలాగే అక్రమంగా నిర్మించిన గీతం యూనివర్సిటీకి చెదిన కొన్ని కట్టడాలను కూల్చివేసినటప్పుడు కూడా ఇలాగే వ్యాఖ్యానించారు. పైగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించి ఉంటే రెగ్యూలరైజ్ చేసుకునే స్కీం ఉంది కదా అని గుర్తుచేశారు. చట్ట ప్రకారం రెగ్యూలరైజ్ చేయొచ్చని.. జరిమానా విధించవచ్చని చెప్పారు. ఈ తరహా కూల్చివేతలు మంచిది కాదని హితవు పలికారు. ఇంకో విచిత్రమేమిటంటే కేసీఆర్‌ ప్రభుత్వం అయ్యప్ప సొసైటీలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటే ఆంధ్రోళ్లను టార్గెట్‌ చేస్తున్నారని విమర్శించారు. అక్కడో మాట ఇక్కడో మాట అంటే ఇదేమరి!

Eha Tv

Eha Tv

Next Story