హిమాయత్ నగర్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం(CPI State Office) మక్ధూం భవన్ లో(Makdhoom Bhawan) తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగ సీపీఐ(CPI) జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy), రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Koonanneni Sambasivarao) జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సంద‌ర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ..

హిమాయత్ నగర్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం(CPI State Office) మక్ధూం భవన్ లో(Makdhoom Bhawan) తెలంగాణ విలీన దినోత్సవ(Telangana Liberation Day) వేడుకలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగ సీపీఐ(CPI) జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy), రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Koonanneni Sambasivarao) జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సంద‌ర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో అధికారంలోకి వస్తే విలీన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్‌(KCR) ఇప్పుడు మాట తప్పాడ‌ని విమ‌ర్శించారు. ఎవరికి భయపడి విలీన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహించడం లేదో తెలంగాణ సమాజానికి తెలుసు అని అన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతాంగ సాయుధ పోరాట అమరుల స్థూపాన్ని ఎందుకు నిర్మించలేదని ప్ర‌శ్నించారు.

కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం నిరంకుశ పాలనకు ముగిసిందని అన్నారు. ఏడాది కాలం పాటు సాయుధ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారని వివ‌రించారు. పోరాటాలు చేసింది కమ్యూనిస్టులు అయితే.. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. రైతాంగ పోరాట అమర వీరుల పోరాట స్పూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు.

Updated On 17 Sep 2023 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story