Chada Venkat Reddy : బీజేపీ బీఆర్ఎస్ కోసం పనిచేస్తుంది
తెలంగాణ(Telangana) సమాజం మొత్తం మావైపే చూస్తుందని సీపీఐ(CPI) నేత చాడ వెంకట్ రెడ్డి(Chada Venkat Reddy) అన్నారు. గాంధీ భవన్‌లో(Gandhi Bhavan) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ లక్ష్యం మేరకు తెలంగాణ సాదించుకున్నామో అది నెరవేరడం లేదన్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాలేదు.. సకలజనులు పోరాటం చేస్తేనే రాష్ట్రం వచ్చిందన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో కొట్లాడినం.. సోనియా గాంధీ(sonia Gandhi) ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.

Chada Venkat Reddy

మోదీ(Modi) రాష్ట్ర ఏర్పాటుపై విమర్శలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కేసీఆర్(KCR) కుటుంబ పాలనే సాగుతుంది.. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉద్యమకారులున్నారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అద్భుతం అన్నారు ఏమైందని నిలదీశారు. కాంగ్రెస్(Congress) హయాంలో కట్టిన ప్రాజెక్టులు కులాయా అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీలతో ఉద్యోగాల భర్తీ కాలేదు. నిరుద్యోగులు కేసీఆర్ పై కోపంగా వున్నారన్నారు.
రాష్ట్రంలో నియంత పరిపాలన సాగుతోందని విమర్శించారు. ప్రజాదర్బార్ ఏమైందని ప్రశ్నించిన ఆయన.. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ఉపాధి అవకాశాలు లేవు.. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అన్నాడు.. అన్ని బంద్ అయ్యాయి. బీజేపీ కూడా బీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని ఆరోపించారు. కొత్తగూడెంలో సీపీఐ ని, మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.