ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నందుకు సుప్రీంకోర్టులో చివాట్లు తిన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నందుకు సుప్రీంకోర్టులో చివాట్లు తిన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) హైడ్రా పేరుతో హైదరాబాద్(Hyderabad)లో భయోత్పాతాన్ని సృష్టించినందుకు హైకోర్టు నుంచి మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తంగా గురుశిష్యులిద్దరికి న్యాయస్థానాలు(Courts) షాక్‌నిచ్చాయి. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు(CM Chadrababu Naidu) చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్టు ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది. నెయ్యిని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేశామని టీటీడీ ఈవో (TTD EO)చెప్పారు కదా? ఇదంతా పబ్లిక్ డొమైన్‌లోనే ఉంది కదా అని సుప్రీంకోర్టు నిలదీసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని సూచించింది. 'మీరు మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదు కదా? రాజ్యంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి. జులై రిపోర్ట్ వస్తే సెప్టెంబర్‌లో చెప్పారెందుకు? సిట్ ఎందుకు వేశారు? సిట్ (SIT)దర్యాప్తు సరిపోతుందా? అని ప్రశ్నల పరంపర కురిపించింది. వీటికి బదులు చెప్పలేక ప్రభుత్వం తరఫు న్యాయవాది సిదార్థ్ లూథ్రా(Sidharth Luthra) నీళ్లు నమిలారు.
ఇటు తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్‌పూర్(Aminapur) కూల్చివేతలపై విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner AV Ranga Nath), అమీన్‌పూర్ ఎమ్‌ఆర్‌వో(MRO)పై హైకోర్టు అక్షింతలు వేసింది. 'సెప్టెంబర్ 5వ తేదీన తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఆసుపత్రి భవనాన్ని ఎలా కూల్చివేస్తారు? ఆదివారం ఎలా కూలుస్తారు? ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా ? అని ప్రశ్నల వర్షం కురిపించింది. తాము అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఈ సందర్భంగా హైకోర్టు చురకంటించింది. అమీన్‌పూర్ గురించి అడిగితే కావేరి హిల్స్(Kaveri Hills)పై సమాధానం ఎందుకు చెప్తున్నారని సున్నితంగా మందలించింది. చార్మినార్ ఎమ్మార్వో(Charminar MRO) చెబితే చార్మినార్ కూల్చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట వ్యతిరేకంగా పని చేసే అధికారులను చంచల్‌గూడా(Chenchalaguda), చర్లపల్లి(Cheralapalli) జైలుకు పంపిస్తామని హెచ్చరించింది హైకోర్టు.